ETV Bharat / crime

రెమ్​డెసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే ఏడుగురు అరెస్ట్ - తెలంగాణ వార్తలు

రెమ్​డెసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్​ఫోర్స్ పోలీసులు తెలిపారు. వేర్వేరుగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి 32 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

Seven members arrested for selling remdesivir injections, hyderabad task force police
రెమ్​డెసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే వ్యక్తులు అరెస్ట్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
author img

By

Published : May 16, 2021, 11:20 AM IST

రెమ్​డెసివర్‌ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పంజాగుట్ట, బంజారాహిల్స్‌, ఎస్‌ఆర్‌నగర్‌ ప్రాంతాల్లో వీరిని వేర్వేరుగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 32 రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు, ఏడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన పార్థసారధి అతని అనుచరుడు రామలింగేశ్, బంజారాహిల్స్‌ వాసులు గిరీశ్ కుమార్‌, గౌరీ శంకర్‌, హరీశ్ కుమార్‌, ముకుందరావు, చిన్నలను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

రెమ్​డెసివర్‌ ఇంజక్షన్లను రూ.25 నుంచి 35 వేల వరకు విక్రయిస్తున్నట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే వారిపై తమకు ఫిర్యాదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: కట్టడి ఆంక్షలతో చిరువ్యాపారులకు కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.