బ్లాక్ ఫంగస్ చికిత్సలో వినియోగించే ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తోన్న ఓ ముఠాను సికింద్రాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి.. 5 ఆంపోటేరిసీయాన్ బీ ఇంజెక్షన్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని… వారిని రిమాండ్‌కు తరలించారు.
ధనార్జనే ధ్యేయంగా మెడికల్ విభాగానికి చెందిన నిందితులు.. యాదయ్య(46), సతీశ్(31), సాయికుమార్(29), రాజశేఖర్(31)లు ఇంజక్షన్లను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు తెలిపారు. రూ. 8 వేల విలువగల టీకాను.. రూ. 50 వేలకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ముందస్తు సమాచారంతో.. కాచిగూడ పీఎస్ పరిధిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నామని వివరించారు. ఆపత్కాలంలో అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: రూ.350 కోట్ల విలువైన బియ్యం ఎగవేత.. ఇప్పటికీ చర్యలు లేవు..