HM Harassed Students: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సేపూరి నరసింహ.. వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నాడని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు. గత కొద్ది కాలంగా విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడం, వారితో బయట నుంచి సిగరెట్లు, మద్యం తెప్పించుకోవడం లాంటివి చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా బాలికలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వెలిబుచ్చారు. ఈ వేధింపులు భరించలేక ఇవాళ విద్యార్థులంతా మాకు ఈ హెడ్మాస్టర్ వద్దంటూ ఆందోళనకు దిగారు.
సస్పెండ్ చేయాలి
ఆందోళన చేపడుతున్న సమయంలో పాఠశాలలో హెడ్ మాస్టర్ లేకపోవడంతో ఎమ్ఈవో ఆదేశాలతో.. గుండ్రంపల్లి ప్రధానోపాధ్యాయుడు వచ్చి తల్లిదండ్రులకు సర్ధిచెప్పారు. విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయనకు వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్... పీఆర్సీ బకాయిలు చెల్లింపు