ETV Bharat / crime

గంజాయి రవాణాకు పాల్పడిన సర్పంచ్.. పదవి నుంచి తొలగింపు - gardegav sarpanch dismissed

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ప్రజలకు సేవ చేయాల్సిన సర్పంచ్​ అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు పట్టుబడి.. అటు పేరుతో పాటు పదవిని పోగొట్టుకున్నాడు.

gardegav sarpanch dismissed
గర్డెగావ్​ సర్పంచి తొలగింపు
author img

By

Published : Oct 23, 2021, 6:43 PM IST

గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడి.. పోలీసుల రిమాండ్​లో ఉన్న సర్పంచ్​ను పదవి నుంచి తొలగిస్తూ సంగారెడ్డి కలెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారు. సిర్దాపూర్ మండలం గర్డెగావ్ సర్పంచ్​ కొండా బాలాజీ బాధ్యతాయుతమైన ప్రజాపతినిధిగా ఉండి చట్ట విరుద్ధ పనులకు పాల్పడ్డాడు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా అతనిని పోలీసులు పట్టుకున్నారు.

ఈ మేరకు బాలాజీని పదవి నుంచి తొలగిస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందుకే పదవి నుంచి తొలగించినట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉప సర్పంచ్​ బాబురావును ఇన్ఛార్జి సర్పంచ్​గా నియమించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13న పెద్దశంకరంపేట్ పోలీస్​స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు.. సర్పంచ్​ బాలాజీని పట్టుకున్నారు.

ఇదీ చదవండి: Mallu Ravi: 'రేవంత్​ రెడ్డిని చూస్తే కేసీఆర్​, కేటీఆర్​ల​కు వణుకు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.