ETV Bharat / crime

Bus driver death: ప్రయాణికులను కాపాడి.. బస్సు డ్రైవర్ మృతి - telangana news

గుండెనొప్పి భరిస్తూనే దాదాపు 3 కిలోమీటర్ల మేర బస్సు నడిపిన ఆ డ్రైవర్.. ప్రయాణికులను కాపాడి, తాను తనువు చాలించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఈ ఘటన జరిగింది.

Bus driver death, heart attack
బస్సు డ్రైవర్ మృతి, డ్రైవర్​కు గుండెపోటు
author img

By

Published : Jul 7, 2021, 10:16 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ఆర్టీసీ డిపో పల్లెవెలుగు బస్సు మంగళవారం సాయంత్రం మాచర్ల నుంచి పిడుగురాళ్లకు వస్తోంది. అందులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. నడికూడి వద్దకు రాగానే డ్రైవర్ ఎం.సుభానీ (54)కి హఠాత్తుగా గుండెనొప్పి వచ్చింది. భరిస్తూనే దాచేపల్లి మండలం నారాయణపురం బంగ్లా వద్దకు తెచ్చి దారి పక్కన ఆపి ప్రయాణికులకు విషయం చెప్పారు. వెంటనే కండక్టరు ఖాసీంబీతో పాటు ప్రయాణికులు సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత అంబులెన్స్‌లో పిడుగురాళ్ల తరలిస్తుండగా మార్గంమధ్యలో తుమ్మలచెరువు వద్ద కన్నుమూశారు. పిడుగురాళ్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు.

ఇదీ చదవండి: Suicide: ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.