ETV Bharat / crime

రన్నింగ్‌లో ఉండగానే ఊడిపోయిన ఆర్టీసీ బస్సు చక్రాలు... - RTC bus wheels blown off while running at katepally

RTC bus wheels blown off
ఊడిపోయిన ఆర్టీసీ బస్సు చక్రాలు
author img

By

Published : Jul 21, 2021, 9:51 AM IST

Updated : Jul 21, 2021, 10:34 AM IST

09:50 July 21

రన్నింగ్‌లో ఉండగానే ఊడిపోయిన ఆర్టీసీ బస్సు చక్రాలు...

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్​ నుంచి తొర్రూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు మార్గమధ్యలోనే ఊడిపోయాయి. గమనించిన డ్రైవర్.. వెంటనే అప్రమత్తమవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనలో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.  ​  

మరోవైపు కాటేపల్లి నుంచి రాయిపల్లి వైపు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండటంతో ఆ మార్గంలో ప్రయాణం సాఫీగా లేదని డ్రైవర్​ తెలిపారు. ఆ కారణంగానే బస్సు ఎడమవైపు చక్రాలు ఊడిపోయాయని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.  

ఇదీ చదవండి: 'రోడ్డుపై గుంత కనిపిస్తే ఆయన ఆగలేరు... వెంట వెళ్లకుండా నేనూ ఉండలేను'

Last Updated : Jul 21, 2021, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.