అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఓ కారును ఢీకొట్టి బైక్ మెకానిక్ షెడ్డులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. కారు వెనుకభాగం నుజ్జునుజ్జయింది. ఘటనలో బైక్ మెకానిక్ షెడ్డులో వాహనాలు ధ్వంసమయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా 20 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఆటోను ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.
ఇదీ చూడండి: టీవీఎస్ లూనాను ఢీకొట్టిన లారీ... కౌలు రైతు మృతి