ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ల సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి పొదిలి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని.. కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
మృతులు కనిగిరి మండలానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: చెరువులో దూకి తల్లి, ఏడాదిన్నర చిన్నారి మృతి