ETV Bharat / crime

బ్లాక్​లో రెమ్​డెసివిర్​.. మెడికల్ షాప్​ నిర్వాహకుడు అరెస్ట్​ - రెమ్​డెసివిర్ ధర

కరోనా కష్ట కాలాన్ని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు.. మందులు, ఇంజక్లన్లను బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్,​ టప్పాచబుత్ర పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఇలాంటి దందాకు పాల్పడుతోన్న ఓ మెడికల్ షాప్​ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

remidisevir in black market
remidisevir in black market
author img

By

Published : May 7, 2021, 9:48 AM IST

హైదరాబాద్​ టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​లను బ్లాక్​లో విక్రయిస్తోన్న ఓ మెడికల్ షాప్​ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరు చిన్నారులనూ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5​ ఇంజక్షన్​లు, 3 మొబైల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

నిందితుడు నిఖిల్ అగర్వాల్.. గుడిమల్కాపూర్​లోని​ ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద మెడికల్ షాప్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్లాక్​లో ఒక ఇంజక్షన్​ను రూ.30 వేలకు విక్రయించినట్లు తెలిపారు. చిన్నారుల సాయంతో విక్రయాలు జరుపుతుండగా పట్టుకున్నట్లు వివరించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: మద్యం మానేయమన్నందుకు గొడవ.. మనస్తాపంతో ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.