సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో వర్ధమాన్ రసాయన పరిశ్రమలో రియాక్టర్లో ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం చేస్తూ మూత ఊడిపడటం వల్ల కార్మికులు భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం వల్ల పరిశ్రమ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.