Reactor exploded at Veliminedu నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పెలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్‌కు తరలించారు. మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.
మంటలు వ్యాపించడంతో స్థానికుల ఆందోళన