ETV Bharat / crime

ఐసీయూలో రోగి కాలు, చేతుల వేళ్లు కొరికేసిన ఎలుకలు

author img

By

Published : Mar 31, 2022, 11:08 AM IST

Updated : Mar 31, 2022, 2:12 PM IST

11:07 March 31

ఐసీయూలో రోగి కాలు, చేతుల వేళ్లు కొరికేసిన ఎలుకలు

ఐసీయూలో రోగి కాలు, చేతుల వేళ్లు కొరికేసిన ఎలుకలు

అసలే ప్రాణాపాయస్థితి. జిల్లాలో పేరెన్నికగన్న ప్రభుత్వ పెద్దాసుపత్రికి వెళ్తే ప్రాణాలు నిలుపుకోవచ్చనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రాణాలు నిలుపుకుందామనే వస్తే ఎలుకలు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల... భూమ్మీద నూకలు చెల్లిపోయే పరిస్థితి దాపురించింది. ఎంతో మంది రోగులకు వరప్రదాయినిగా మారిన వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి... మరికొందరు రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పెద్దాసుపత్రికి వచ్చిన రోగులకు ప్రాణాల మీద ఆశలు లేకుండా చేస్తోంది. ఇటీవల కాలంలో ఎలుకల కారణంగా కొందరు రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అసలే కిడ్నీ, లివర్‌ సమస్యలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాస్‌ మీద ఎలుకలు రెండ్రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడి చేసి కాళ్లు, చేతుల వేళ్లు కొరికాయి. దీంతో ప్రాణాలు నిలుపుకుందామని ఇక్కడికొస్తే ఇదేం పరిస్థితి అంటూ శ్రీనివాస్‌ బంధువులు వాపోతున్నారు.

ఐసీయూలోనే ఇలా ఉంటే ఎలా?.. ఆయన కిడ్నీ, లివర్​ సమస్యలకు చికిత్సను తీసుకుంటున్నారు. వెంటిలేటర్​పై చికిత్సను పొందాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థిక స్థోమత సరిగా లేక ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించాం. వైద్యులు చికిత్స చేస్తున్నారు. రాత్రి ఒక అరగంట పాటు పడుకున్నాను. అరగంట తర్వాత లేచి చూస్తే పరిస్థితి భయంకరంగా ఉంది. అతని చేతి వేళ్ల నుంచి రక్తం కారుతూ ఉంది. కింద అంతా రక్తం పడి ఉంది. వైద్యులను కేకలు వేయగా వారు వచ్చారు. ఏమిటని వారిని ప్రశ్నించగా.. ఎలుకలు కొరికాయని తెలిపారు. ఐసీయూలోనే ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించాను. -శ్రీకాంత్‌, బాధితుడి సోదరుడు

రోగుల ప్రాణాలకు భరోసా ఏది?.. ఎలుకలు కొరికిన ఘటనలు తరచుగా జరగడం పట్ల రోగుల బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్దాసుపత్రిలో పారిశుద్ధ్యం పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఎంజీఎం ఆసుపత్రి సమస్యలపై దృష్టి సారించి రోగుల ప్రాణాలకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం.. ఘటనపై స్పందించిన ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌... బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రోగుల బంధువులు బయటి నుంచి ఆహారం తీసుకొచ్చి పడేయడం వల్లే ఎలుకల బెడద ఎక్కువైందని పేర్కొన్నారు. ఎలుకల దాడికి గురైన శ్రీనినాస్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

ఆరోగ్య పరిస్థితి విషమం

"రోగిని ఎలుకలు కొరికేసిన ఘటన నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది." -శ్రీనివాసరావు, సూపరింటెండెంట్‌, ఎంజీఎం ఆసుపత్రి

ఇదీ చదవండి: Elephant Attack : చిత్తూరు జిల్లాలో ఏనుగు విధ్వంసం.. రైతు మృతి

Last Updated : Mar 31, 2022, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.