అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామం వద్ద 15 క్వింటాళ్ల చౌకబియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాహనాన్ని సీజ్ చేశారు.
నిన్న రాత్రి పరిగిలోని ఓ ఇంట్లో 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుకున్న రేషన్ బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.