ETV Bharat / crime

rape: చెరకు రసం తాగిస్తానని చెప్పి.. యువకుడిపై అత్యాచారం - దక్షిణ కన్నడ జిల్లా

చెరకు రసం తాగిస్తానని నమ్మించి.. యువకుడిపై మరో యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

rape on boy
rape on boy
author img

By

Published : Oct 17, 2021, 3:52 PM IST

కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు ఆడ, మగా, చిన్నాపెద్ద అని తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి దారుణ ఘటనే ఇది. ఓ పురుషుడిపై మరో పురుషుడు అత్యాచారానికి పాల్పడగా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులో జరిగింది.

ఇదీ జరిగింది:

కబాక గ్రామంలో ఓ 20 ఏళ్ల యువకుడు సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో నిందితుడు మహ్మద్‌ హనీఫ్‌ పలకరించాడు. చెరకు రసం తాగిస్తానంటూ నమ్మించాడు. ఇదివరకే పరిచయం ఉండడం వల్ల నమ్మి తనతో వెళ్లిన ఆ యువకుడిని.. హనీఫ్‌ చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఆ యువకుడి బట్టలకు బురద ఉండటాన్ని గమనించిన తండ్రికి.. కొడుకు జరిగిన విషయాన్ని చెప్పాడు. బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Road Accident: బైక్‌ను ఢీకొన్న లారీ.. తల్లీ, కుమారుడు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.