మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఎల్బీనగర్ బండ్లగూడకు చెందిన బండారి నగేష్ ప్రేమ పేరిట ఓ మైనర్ బాలికను నమ్మించి.. ఆమెను బలవంతంగా యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు.
వివాహం చేసుకున్న ఫొటోలను చరవాణిలో తీసుకుని ఆమెను తిరిగి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. తన కోరిక తీర్చకపోతే వివాహం చేసుకున్న చిత్రాలను బాలిక బంధువులకు చూపుతానంటూ బెదిరించాడు.
ఆమె కళాశాలకు పోయేందుకు బస్టాపులో ఉండగా బలవంతంగా.. తన ఇంటికి తీసుకువెళ్లి బాలికపై వారం రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఈ మేరకు నేరం రుజువు కావడంతో.. రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
ఇదీ చూడండి : 800కిలోమీటర్లు.. 900సీసీ కెమెరాలు.. చిక్కిన కిడ్నాపర్