హైదరాబాద్ మణికొండలో డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన రజినీకాంత్ మృతదేహం (rajinikanth dead body found) లభ్యమైంది. డ్రైనేజీ కలిసే నెక్నాంపూర్ చెరువులో(dead body found in Neknampur Pond)మృతదేహం కనిపించింది. మూడు కిలోమీటర్ల దూరం రజనీకాంత్ మృతదేహం కొట్టుకొచ్చింది. గోపిశెట్టి రజినీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు పెరుగు ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రజినీకాంత్... నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యారు. మూడ్రోజులుగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ముమ్మరంగా వెతికారు.
డ్రైనేజీ దారిగుండా వెళ్లి గాలింపు చేపట్టారు. వర్షం కారణంగా గాలింపునకు అంతరాయం ఏర్పడగా.... వాన తగ్గిన తర్వాత వెతుకులాట కొనసాగించారు. నెక్నాంపూర్ చెరువులో జేసీబీ సాయంతో గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టగా.... రజినీకాంత్ మృతదేహాన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గుర్తించారు.
అసలేం జరిగింది..
మణికొండలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు సెక్రటేరియట్ కాలనీ గోల్డెన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న మ్యాన్‌హోల్లోకి చేరింది. రాత్రి 9.15గం.ల సమయంలో కాలినడకన అటువైపుగా వెళ్తున్న వ్యక్తి అందులో పడి గల్లంతయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ఓ వ్యక్తి వర్షం వీడియో తీస్తుండగా రికార్డ్ అయ్యింది. ఇది వైరల్ కావడంతో నార్సింగి పోలీసులు, మణికొండ మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహకారంతో డ్రైనేజి పొడవునా వెదికినా గల్లంతయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పైపులైన్ పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.
ఇదీ చూడండి: Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. డ్రైనేజీ గుంతలో పడి ఒకరు గల్లంతు