కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో వీఆర్ఏ నర్సింహులు ఆత్మహత్యాయత్నం చేశారు. రాజంపేట్ మండల కార్యాలయంలో నర్సింహులు వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల విషయంలో ఆర్ఐ ప్రభాకర్ రెండు నెలలుగా తనను టార్గెట్ చేస్తున్నారని నర్సింహులు ఆరోపించాడు. సరిగా పని చెేయడం లేదని వేధిస్తూ... జీతాన్ని ఆపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు వాపోయాడు. మానసిక క్షోభకు గురై... ఆత్మహత్యాయత్నం చేసినట్లు పేర్కొన్నాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
ఇదీ చూడండి: ఆటోను ఢీకొన్న వ్యాన్.. నలుగురు దుర్మరణం