స్నేహితురాలి వద్ద రూ. 3.10 లక్షలు కాజేసిన ఇద్దరు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పూలకుంట శ్రీనివాసులు, ఉదయ్ మనీశ్‌లు ఉద్యోగం కోసం హైదరాబాద్‌కి వచ్చారు. అమీర్‌పేట్‌లోని ఓ వసతి గృహంలో ఉంటుండగా వీరికి గణేష్ అనే విద్యార్థి పరిచయమయ్యాడు. గణేష్ స్నేహితురాలైన ఓ యువతికి శ్రీనివాసులు, మనీశ్ దగ్గరయ్యారు. స్నేహంగా మెలిగారు. తరచూ ఆమె ఇంటికి వెళ్తుండేవారు.
ఓరోజు ఊరికి వెళ్తూ.. తన ఇంట్లో ఉన్న కుక్కపిల్లను తీసుకెళ్లాలని సదరు యువతి వారిని కోరింది. ఆటో ఛార్జీలకు ఐదు వందలు ఇవ్వాలని శ్రీనివాసులు, గణేష్ ఆమెను అడిగారు. అందుకు ఆమె తన వద్ద నగదు లేదని.. ఫోన్ ఇచ్చి నగదు బదిలీ చేసుకోవాలంటూ యూపీఐ ఐడీ చెప్పింది. అప్పుడే రూ.5 వేలను తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నారు. ఆమె వద్దనున్న ఏటీఎం కార్డునూ దొంగలించారు. అనంతరం అక్కడ నుంచి గోవాకు వెళ్లిపోయారు. విలాసవంతంగా గడిపి రూ.3.10 లక్షలను ఖర్చు చేశారు. ఓ రెండు ఫోన్లు కొనుగోలుచేశారు.
ఈ విషయంపై అప్రమత్తమైన యువతి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. ఏటీఎం కార్డు పోగొట్టుకొంటే సంబంధిత బ్యాంకులకు ఫిర్యాదు చేసి బ్లాక్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
ఇవీచూడండి: పెళ్లి చేసుకుంటా.. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.7.55 లక్షలు స్వాహా!