ETV Bharat / crime

లక్షల్లో లాభాలు చూపిస్తూ... ఖాతాలో సొమ్ము కాజేస్తూ.. - ఆన్​లైన్​ ట్రేడింగ్​ యాప్​తో మోసాలు

ఆన్​లైన్​ ట్రేడింగ్ యాప్​లో పెట్టుబడితో ఎక్కువ మొత్తం వస్తుందని నమ్మించి సొమ్ము కాజేసిన ముగ్గురుని రాచకొండ సైబర్​ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. 14 నకిలీ కంపెనీలు సృష్టించి.. సొమ్ము కాజేసిన వారిని అదుపులోకి తీసుకుని వారి బ్యాంకులలో ఉన్న 3.5 కోట్ల సీజ్ చేసినట్లు తెలిపారు.

online trading crime
cyber crime
author img

By

Published : Apr 11, 2021, 11:18 AM IST

లక్షల్లో లాభాలు చూపిస్తూ... ఖాతాలో సొమ్ము కాజేస్తూ..

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు కేటుగాళ్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ‘విన్‌బిజ్‌’ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌ పేరిట 20 లక్షలకు పైగా మోసపోయానంటూ హయత్‌నగర్‌కు చెందిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసగించిన డబ్బు ఏయే ఖాతాలకు బదిలీ చేశారనే అంశంపై సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు... బెంగళూరు కేంద్రం జరుగుతున్న మోసాలను గుర్తించారు.

అమాయకులకు వలపన్నుతున్న అశోక్‌కుమార్‌, సంజీవ్‌కుమార్, ఆసిం అక్తర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే ఆనతికాలంలోనే అధిక రెట్లు సంపాదించొచ్చంటూ నమ్మిస్తూ... ఆ తర్వాత లక్షల్లో లాభాలొచ్చినట్లు చూపిస్తారు. అదంతా నిజమేనని భావించి బాధితులు మరిన్ని పెట్టుబడులు పెట్టాక... తీరా ఆ డబ్బులను తీసుకొనే అవకాశం ఉండదు. కొన్నిరోజులకు యాప్‌లోనూ బ్లాక్‌ చేస్తారు. ఇలాంటి ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సూచించారు.

మోసం జరిగింది ఇలా...

హైదరాబాద్​ హయత్​నగర్​కు చెందిన యువతికి మొబైల్​కు హాంకాంగ్ నంబర్ నుంచి ఇన్వెస్ట్​మెంట్​ యాప్​లలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఓ సందేశం వచ్చింది. ఆ యాప్​లను డౌన్​లోడ్​ చేసుకుని రూ.500 పెట్టుబడి పెట్టింది. ఆరువాత ఆమెను స్ట్రాటజీ ఓం అనే పేరుతో వాట్సాప్ గ్రూప్​లో చేర్చారు. తరువాత ఆ ఖాతాలో రూ. 20లక్షలు పెట్టుబడి పెట్టింది. అప్పుడు ఆమె ఖాతాలో రూ.30.30 లక్షలు లాభాలు వచ్చినట్లు నగదు నిల్వ చూపిస్తూ కంపెనీ నుంచి మెసేజ్​ వచ్చింది. తర్వాత మరింత మొత్తం జమ చేసింది. అప్పటికి ఆమె ఖాతాలో రూ. 54.39 లక్షలు చూపించారు. ఆమొత్తాన్ని ఆమె తీసుకునేందుకు ప్రయత్నించగా అసలు విషయం తెలిసింది.

డబ్బులు డ్రా చేసుకునేందుకు ఆమె ప్రయత్నించగా.. వీలుకాలేదు. బ్యాంకు అధికారులను సంప్రదించగా.. ఆమె ఖాతాలో ఉన్న సొమ్ము మరో నలుగురి ఖాతాల్లోకి బదిలీ అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. మోసపోయానని గ్రహించిన యువతి సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు అశోక్ కుమార్, కంచి సంజీవకుమార్, అసిమ్​ అక్తర్​ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3సీపీయూలు, 24 నకిలీ కంపెనీల స్టాంపులు, 22 సెల్ ఫోన్లు, 14 నకిలీ కంపెనీల బ్యాంకు అకౌంట్స్ చెక్ బుక్​లు స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు.

ఇదీ చూడండి: ఐడీఏ బొల్లారంలో భార్య, అత్తను హత్య చేసిన అల్లుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.