ETV Bharat / crime

Pregnancy Woman Died: ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి... సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆందోళన - తెలంగాణ వార్తలు

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిందంటూ హైదరాబాద్ కోఠి ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి సిబ్బందితో కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఫలితంగా ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది.

Pregnancy Woman Died
Pregnancy Woman Died
author img

By

Published : Sep 27, 2021, 6:57 PM IST

హైదరాబాద్ కోఠి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ బాలింత మృతి చెందింది. సైదాబాద్ లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన పూజను ప్రసవం కోసం ఆదివారం సాయంత్రం ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆరోగ్యంగా ఉన్న పూజకు ఉదయం కాన్పు కోసం వైద్యులు ఆపరేషన్ చేశారు. అనంతరం పూజ చనిపోయింది.

వైద్యులు సక్రమంగా ఆపరేషన్ చేయక పోవడంతో... మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందంటూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి సిబ్బందితో కుటుంబ సభ్యులు వాగ్వావాదానికి దిగారు.

పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు బాధితులకు సర్దిచెప్పారు. ఘటనపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శిశువు క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి: Conistables saves Patients: కానిస్టేబుళ్ల మానవత్వం.. డీజీపీ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.