జగిత్యాల జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార దందాపై పోలీసులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ రహదారిలో జోరుగా వ్యభిచారం సాగుతుందనే పక్కా సమాచారంతో... మూడు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించామని సీఐ జయేశ్ రెడ్డి తెలిపారు. 20 మంది యువతులతో పాటుగా మరి కొంత మంది మహిళలను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ప్రతి ఓటరు పైన దృష్టి పెట్టండి.. గెలుపు మనదే..: సీఎం కేసీఆర్