అడవిలో జంతువులను వేటాడటానికి వెళ్లిన వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం రిజర్వు అడవిలో కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేటగాళ్లు నాటు తుపాకులతో అడవిలోకి వెళ్లినట్లు సమాచారం అందుకున్న జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.
కొడంగల్ నియోజకవర్గం బోయపల్లి తండాకు చెందిన చౌహాన్ సుభాష్ రాఠోడ్, దేవి నాయక్, బానోతు రాఠోడ్, కిషన్ నాయక్, బాబు, దివ్య నాయక్తో పాటు కర్నాటక రాష్ట్రం కార్చినాల్ తండాకు చెందిన రాఠోడ్ భీమ్ నాయక్, రాఠోడ్ రవినాయక్, రాఠోడ్ రతన్ సింగ్, సభావత్ నంద్యానాయక్ అరెస్టైన వారిలో ఉన్నారు.
ఆ వేటగాళ్లపై కేసు నమోదు చేసిన బషీరాబాద్ పోలీసులు... తాండూరు కోర్టులో సోమవారం హాజరు పరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించి పరిగి సబ్ జైలుకు తరలించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త