సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో నివాసముంటున్న భాషమ్మకు తన పక్క గదిలోనే ఉండే గణేశ్‌కు కొంతకాలంగా పరిచయం ఉండడంతో... ఇద్దరు కలిసి ఉంటున్నారు. గణేశ్‌కు డబ్బులు అవసరం అవ్వడంతో భాషమ్మ తన బంగారం అమ్మి రూ.10 వేలు అప్పుగా ఇచ్చింది. ఆ నగదు ఇవ్వమని బాషమ్మ ఎన్నిసార్లు అడిగినా ఇస్తానని చెప్పేవాడు కానీ ఇవ్వలేదు.
బ్లేడ్లతో గొంతు కోసి...
అయితే గణేశ్‌కు ముందే నర్సాపూర్‌కు చెందిన స్వప్న అనే మహిళతో పరిచయం ఉంది. భాషమ్మ తరచూ అప్పు తీర్చమని గణేశ్‌ను అడగడంతో ఆమెను వదిలించుకోవాలని స్వప్న ఆయన్ను ప్రేరేపించింది. దీంతో ఈనెల 14న రాత్రి నిందితుడు భాషమ్మ ఇంటికి వెళ్లి పదునైన రెండు బ్లేడ్లతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇద్దరు నిందితులు అరెస్టు...
ఈనెల 17న బొంతపల్లి కమాన్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గణేశ్‌ను గుమ్మడిదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. హత్యకు ప్రేరేపించిన స్వప్నను కూడా అరెస్టు చేసి ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి చరవాణిలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పోలీసులపై ఆరోపణలు సరికాదు: సీపీ