యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పురంలో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. గ్రామ పరిధిలోని చిట్టబోయినబావికి చెందిన ఎలిమినేటి వెంకట్ రెడ్డిని ఈనెల 17న కిరాతకంగా హత్య చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ గొడవ
గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డికి, ఎలిమినేటి సంజీవరెడ్డికి మధ్య 40 ఏళ్లుగా ఓ భూమి విషయంలో తగాదా ఉంది. ఈ వివాదంతో గతేడాది సంజీవ్ రెడ్డిని వెంకట్‌రెడ్డి గొడ్డలితో నరికి చంపాడు. ఈ కేసులో వెంకట్ రెడ్డి జైలుకు వెల్లివచ్చాడు. జైలు నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి సంజీవ్ రెడ్డి పాలివారితో గొడవ పడుతుండేవాడు. తమను బెదిరిస్తున్న వెంకట్ రెడ్డిని అంతం చేయాలని సంజీవ రెడ్డి పాలివారైన వెంకట్ రెడ్డి... జలంధర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, దామోదర్ రెడ్డితో కలిసి పధకం వేశారు.
ఈ నెల 17న వెంకట్ రెడ్డి గ్రామ సమీపంలోని బండరాళ్ల వద్ద ఉన్నాడని తెలుసుకుని... వీళ్లంతా వెళ్లి వెంకట్ రెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపారు. మృతుడు వెంకట్‌రెడ్డి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను మండలంలోని పులిగిల్లలో అదుపులో తీసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 5 సెల్ఫోన్లు, ద్విచక్రవాహనం, దాడికి వినియోగించిన గొడ్డలి స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. నిందితులను రిమాండ్‌కి తరలించినట్లు డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి: బ్లాక్ మార్కెట్‌కు ఔషధాలు.. ఇద్దరు వైద్యులు సహా ఐదుగురు అరెస్ట్