ETV Bharat / crime

3 కమిషనరేట్లు.. 23 దొంగతనాలు.. బ్రూస్లీ కన్నుపడితే ఇళ్లు ఖాళీ

thieves gang arrest in Hyderabad: పనిలో నిబద్దత, అతి తక్కువ సమయంలోనే ఎక్కువ శ్రమించే నైజం. హైదరాబాద్‌లో వరస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగ లక్షణాలివి. మూడు రోజుల్లోనే 23 దొంగతనాలు చేసి, హైదరాబాద్ టాస్క్‌పోర్స్ పోలీసులకు చిక్కాడు. అతనితోపాటు కలిసి చోరీలకు పాల్పడుతున్న మరో నిందితుడు, ఇద్దరు రిసీవర్లను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

Police Arrested the Thieves
Police Arrested the Thieves
author img

By

Published : Feb 2, 2023, 8:43 AM IST

Updated : Feb 2, 2023, 9:28 AM IST

మూడు కమిషనరేట్ల పరిధుల్లో 23 దొంగతనాలు.. నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు

thieves gang arrest in Hyderabad: కర్ణాటక హుబ్లీకి చెందిన దార్ల నెహెమియా అలియాస్‌ బ్రూస్లీ 12 ఏళ్ల వయసులో హైదరాబాద్‌కు వచ్చాడు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో సమీపంలో హోటల్‌లో పనిచేస్తుండగా, అదే సమయంలో అక్కడ జేబుదొంగలు అతనికి పరిచయం అయ్యారు. వారితో కలిసి చిన్ని చిన్న దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఉండే హాస్టళ్ల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లి చరవాణులు, ల్యాప్‌టాప్‌లు దొంగలించే వాడు.

Police Arrested the Thieves gang : ఇలా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, నంద్యాల, సికింద్రాబాద్ జీఆర్‌పీ పరిధిలో వరస చోరీలు చేశాడు. నెహెమియాపై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో అరెస్టై హుబ్లీ, రాయచూర్ సబ్‌ జైళ్లలో శిక్ష అనుభవించాడు. హుబ్లీ జైలులో అతనికి పరిచయమైన మందుల శంకర్‌తో కలిసి నేమయ్య హైదరాబాద్‌కు వచ్చాడు. సనత్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.

ఇద్దరూ కలిసి గత నెల 23న అర్ధరాత్రి కూకట్‌పల్లిలో ఒకేరోజు 16 ఇళ్లలో చోరీ చేశారు. 24న అర్థరాత్రి ఎల్బీనగర్‌లోని 4ఇళ్లలో చోరీ చేశారు. మరో 3 ఇళ్లలో చోరీకి యత్నించారు. ఇలా ఈ మూడు రోజుల్లోనే ఎల్బీనగర్‌లో 6, మహంకాళిలో 1, చందానగర్‌లో 5, ఆల్వాల్‌లో 5 చోరీల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరి నుంచి బంగారం, వెండితోపాటు 6 ల్యాప్‌టాప్‌లు, రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్టు నేర విభాగ అదనపు సీపీ శ్రీనివాస్ తెలిపారు. నెహెమియా ఓ హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 2, 2023, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.