హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఏడుగురు ట్రాన్స్ జెండర్స్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి సమయంలో బాటసారులను కొట్టడంతోపాటు.. బలవంతంగా డబ్బులు లాక్కుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
మహ్మద్ రహీం అనే ఆటో డ్రైవర్ తన ఆటోలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్తుండగా.. ఇందిరానగర్ వద్ద ట్రాన్స్‌జెండర్స్ అడ్డుతగిలి డబ్బులు లాక్కున్నారని సీఐ శివచంద్ర పేర్కొన్నారు. వద్దని వారించగా అతనిపై దాడి చేసినట్లు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతనిపై దాడి చేసిన ఏడుగురు ట్రాన్స్‌జెండర్స్‌ను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: ప్రజారోగ్యానికి పెను సవాలు