Woman harassment case in KPHB : హైదరాబాద్ కేపీహెచ్బీలో మహిళలకు ఫోన్లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్న సెక్యూరిటీగార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ లోని ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్స్ ది అనెక్స్ గేటెడ్ కమ్యూనిటీలో పవన్‌దాస్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. గేటెడ్ కమ్యూనిటీలోకి వివిధ సర్వీసుల కోసం వచ్చే మహిళల ఫోన్ నంబర్లను రిజిస్టర్‌లో నమోదు చేస్తుంటారు.
ఆ రిజిస్టర్ నుంచి ఓ మహిళ ఫోన్ నంబర్‌ని తీసుకుని.. వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆ మహిళ... కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు పవన్ దాస్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నేను ఓ కంపెనీలో పని చేస్తున్నాను. రాత్రి ఓ అపార్టుమెంట్లో సర్వీసు కోసం వెళ్లాను. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు మా నంబర్లు నమోదు చేసుకుంటాడు. అలాగే నా నంబర్ తీసుకొని అసభ్యకరంగా మెసేజ్ చేశాడు. రాత్రి నుంచి వీడియో కాల్స్ చేస్తున్నాడు. నేను అక్కడికి వెళ్లి అడిగాను. ఏం చేసుకుంటావో.. చేసుకో అంటూ అపార్టుమెంట్ మేనేజర్ అంటున్నాడు. వాళ్లు నన్ను బెదిరించిన రికార్డులు కూడా ఉన్నాయి.
-బాధితురాలు
ఇదీ చదవండి: woman died at Pargi : మహిళకు ఆర్ఎంపీ ఇంజెక్షన్.. వైద్యం వికటించి మృతి!