ETV Bharat / crime

ముత్తూట్ ఫైనాన్స్​లో చోరీకి యత్నం.. నిందితుడు అరెస్ట్ - ముత్తూట్ ఫైనాన్స్ చోరీ కేసు

మేడ్చల్ జిల్లా కేంద్రంలోని గండిమైసమ్మ చౌరస్తా వద్ద ముత్తూట్ ఫైనాన్స్​ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతికత ఆధారంగా బాలానగర్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు సంయుక్తంగా నిందితుడిని పట్టుకున్నారు. వారి నుంచి సుత్తి, బ్లేడ్, చిన్న రాడ్డును స్వాధీనం చేసుకున్నారు.

muthoot finance theft case, medchal news

author img

By

Published : May 8, 2021, 7:10 PM IST

మేడ్చల్ ముత్తూట్ ఫైనాన్స్ గోడకు కన్నం వేసి చోరీకి యత్నించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన సీతారాం కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం వల్ల చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ముఖానికి ముసుగు ధరించి ఈనెల 6వ తేదీన గండిమైసమ్మ చౌరస్తా వద్ద ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ ప్రధాన గేటుకు పక్కన గోడకు రంధ్రం పెట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం లాకర్ తెరవడానికి యత్నించగా అలారం మోగడం వల్ల వెనుతిరిగాడు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు, దుండిగల్ పోలీసులు సంయుక్తంగా సీతారాంను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుడి నుంచి చోరీకి ఉపయోగించిన సుత్తి, బ్లేడ్, చిన్న రాడ్డును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: కరోనా సోకిందని.. భార్యను హత్య చేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.