Retired RI Arrest: సీనియర్ పోలీసు అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న రిటైర్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిషన్‌రావును హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కిషన్‌రావు నుంచి 4 ఎయిర్ గన్లతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. యూసుఫ్‌గూడా పోలీసు బెటాలియన్‌లో కిషన్‌రావు నివసిస్తున్నాడు. స్థల వివాదాలు పరిష్కారిస్తానంటూ డబ్బులు డిమాండ్ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నాడని కిషన్‌రావుపై ఫిర్యాదు రావటంతో.. పోలీసులు అరెస్టు చేశారు.
అన్నపూర్ణ స్టూడియో సమీపంలోని స్థల వివాదం..
కరీంనగర్‌కు చెందిన అబ్బాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద రూ.39 లక్షలు తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని.. ఏసీపీ సుదర్శన్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలోని స్థలాల వ్యవహారంలో కిషన్‌రావు జోక్యం చేసుకున్నట్టు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో కిషన్ రావు ఆయుధాల అక్రమ దందాలో సస్పెండ్ అయ్యారని ఏసీపీ పేర్కొన్నారు. ఈ కేసులో లక్ష్మణ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని ఏసీపీ తెలిపారు.
ఇదీ చూడండి: