ETV Bharat / crime

మున్సిపాల్ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి బెదిరించిన నిందితుడు అరెస్ట్ - municipal town planning officer

జగిత్యాల జిల్లాలో ఫిబ్రవరి 12న మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి తేజస్వినికి ఫోన్‌ చేసి రూ.50 వేలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి కాల్స్ వస్తే పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయాల్సిందిగా జగిత్యాల పట్టణ సీఐ జయేష్‌రెడ్డి తెలిపారు.

crime news of telangana
జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్
author img

By

Published : Apr 11, 2021, 3:02 AM IST

ఫిబ్రవరి 12న జగిత్యాల మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి తెజస్వినికి ఫోన్‌ చేసి.. సీఎం ఫెషి నుంచి మాట్లాడుతున్నానని చెప్పి రూ. యాభై వేలు ఇవ్వాలంటూ డిమాండు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలు ఏం జరిగింది...?

ఫిబ్రవరి 12న హలో.. నేను సీఎం కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా. జర్నలిస్టుల యూనియన్ సమావేశం ఉంది. ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకేసారి ఉంటుంది. ఖర్చుల కోసం మీ వంతుగా రూ.50వేలు పంపించండి. లేకుంటే మీ పదోన్నతి ఆగిపోతుంది' అని జగిత్యాల మున్సిపల్‌ కార్యాలయం టీపీఎస్‌ అధికారిణికి ఓ ఆగంతకుడు కాల్ చేశాడు. ఇవ్వకపోతే ప్రమోషన్‌ ఆగిపోతుందని.. ఏసీబీతో దాడి చేస్తామని ఫోన్ చేసి బెదిరించాడు.

తర్వాత..?

'హలో.. నేను సీఎం పేషీ నుంచి చారిని మాట్లాడుతున్నా. కేటీఆర్‌ ఆఫీసు నుంచి మీ పేరు ఫాక్స్‌లో వచ్చింది. జర్నలిస్టుల యూనియన్ సమావేశం ఉంది. గవర్నర్‌, ముఖ్యమంత్రి అతిథులుగా వస్తారు. భోజనాలు ఏర్పాటు చేయాలి. ఖర్చుల కోసం మీ వంతుగా రూ.50వేలు పంపించండి అని కోరారు. ఫోన్‌ కాల్‌ నిజంగానే సీఎం పేషీ నుంచే వచ్చిందని తేజస్విని నమ్మారు. పదేపదే కాల్‌ రావడంతో భయంతో వణికిపోయారు. అంత మొత్తం ఇచ్చుకోలేనని బతిమాలారు.

పదే పదే కాల్స్ రావటంతో..

పదే పదే కాల్స్ రావడంతో అనుమానం వచ్చిన బాధితుగాలు జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు సూర్యప్రకాశ్‌చారిని పట్టుకుని రిమాండుకు తరలించారు. అతనిపై ఇప్పటికే 16 కేసులతో పాటు రౌడిషీటు కూడా ఉన్నట్లు జగిత్యాల పట్టణ సీఐ జయేశ్​‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:రక్తపాతం మధ్య బంగాల్ నాలుగో విడత పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.