ETV Bharat / crime

డీఎస్పీనని చెప్పాడు.. ఆదుకుంటానని దోచేశాడు!

ఇంటిలిజెన్స్ డీఎస్పీ అన్నాడు... నీ కష్టం నేను తీరుస్తా అన్నాడు. 5 లక్షలు ఇస్తే... మీ ఎడ్లు మృతి చెందినందుకు వచ్చే 45 లక్షల పరిహారం అందిస్తానన్నాడు. మాయ మాటలు నమ్మి.. పుట్టెడు కష్టంలోనూ.. ఏదోలా నగదు చెల్లించాడు ఆ రైతు. తీరా అవతలి వ్యక్తి నుంచి ఎటువంటి సమాచరం లేకపోవటంతో.. మోసపోయానని గ్రహించి.. పోలీసులను ఆశ్రయించాడు.

person-cheated-farmer-with-the-name-of-intelligence-dsp-at-samarlakota-located-in-east-godavari-district
ఆదుకుంటానని... దోచేశాడు!
author img

By

Published : Feb 18, 2021, 1:49 PM IST

‘హలో.. నేను ఇంటెలిజెన్స్‌ డీఎస్పీని మాట్లాడుతున్నా.. మీ ఎడ్లకు విషమిచ్చి హత్య చేసిన కేసును నేనే చూస్తున్నా.. నేను చెప్పినట్లు చేస్తే రూ. 45 లక్షలు బీమా సొమ్ము పరిహారంగా వస్తుంది’.. ఆ మాటలు వినగానే పుట్టెడు వేదనతో ఉన్న రైతుకు ఏదో ఊతం దొరికినట్లయింది. అవతలి వ్యక్తి రెండుసార్లు ఫోన్‌చేసి మాయమాటలు చెప్పి భరోసా ఇచ్చేసరికి అమాంతం నమ్మేశాడు. నాకో రూ.5 లక్షలు ఇస్తే పనైపోద్ధి. విషయం మాత్రం మూడో వ్యక్తికి తెలియకూడదని మాట తీసుకున్నాడు. అంతే.. ఏదో న్యాయం జరుగుతుంది కదా.. అనే ఆశ కొద్దీ ఆ రైతు అతడు చెప్పినట్లే చేశాడు. తీరా కొద్దిరోజులు పోయాక అసలు విషయం తెలిసింది. ప్రాణసమానమైన ఎడ్లు కోల్పోయి.. పీకల్లోతు వేదనతో ఉన్న తాను మరింత నష్టపోయానని గుర్తించి ఎట్టకేలకు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆంధ్రప్రదేశ్​ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలోని పెద్దనుయ్యి వీధికి చెందిన వల్లూరి సత్యేంద్రకుమార్‌కు చెందిన పందెపు ఎడ్లు జనవరి 29న ఆకస్మికంగా మృతిచెందాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషమిచ్చి చంపేశారని అతడు అనుమానం వ్యక్తం చేయడంతో సామర్లకోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 2న బాధిత రైతు సత్యేంద్రకుమార్‌కు ఓ వ్యక్తి ఫోన్‌చేసి ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా పరిచయం చేసుకున్నాడు. చనిపోయిన ఎడ్లకు రూ. 45 లక్షలు బీమా వస్తుందని నమ్మించాడు. తన వంతు సొమ్ము బ్యాంకు ఖాతాలో జమచేస్తే సరిపోతుందని ఎస్‌బీఐ, సిటీ యూనియన్‌ బ్యాంకులకు చెందిన రెండు ఖాతాల నంబర్లు ఇచ్చాడు. ఈ నెల 3 నుంచి 6వ తేదీ మధ్య ఆ ఖాతాలకు 13 విడతల్లో రూ.4.99 లక్షలు జమ చేశాడు. అనంతరం ఆ వ్యక్తి జాడలేకపోవడంతో స్నేహితుల వద్ద గోడు వెల్లబుచ్చుకోవడంతో అసలు విషయం చుట్టూ తిరిగి పోలీసుల వరకు వెళ్లింది. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సామర్లకోట ఎస్సై సుమంత్‌ చెప్పారు.

person-cheated-farmer-with-the-name-of-intelligence-dsp-at-samarlakota-located-in-east-godavari-district
బ్యాంకు రశీదు..

అంతర్రాష్ట్ర మోసగాడేనా..?

సామర్లకోట రైతును మోసగించిన వ్యక్తి అంతర్రాష్ట్ర మోసగాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి చరవాణి, బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నారు. బ్యాంకు ఖాతాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఖాతాలు, ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఆ వ్యక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.