ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా బాపులపాడు మండలం ఏ. సీతారామపురం వద్ద తేలప్రోలు-ఉయ్యూరు రహదారిపై ఓ వ్యక్తి మృతదేహంతో కొందరు నిరసనకు దిగారు. మృతుడి భార్యను అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి అసభ్యకరంగా చిత్రీకరించడంతో... మనస్తాపానికి గురై బాధితుడు గుండెపోటుతో మరణించాడని అతడి బంధువులు ఆరోపించారు. బాధితుడి మరణానికి కారణమైన వ్యక్తి ఇంటి వద్ద మృతుడి బంధువులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు... న్యాయం చేస్తామని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో... మృతుడి ఆరోగ్య పరిస్థితి సైతం రెండు రోజుల నుంచి బాగోలేదని గ్రామస్థులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితమే నిందితుడిపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని వీరవల్లి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. అతడిని పోలీసులు ముందే అదుపులోకి తీసుకోకపోవడం వల్లే... బాధితుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ప్రేమిస్తున్నానంటూ వెంటపడి... పెళ్లికి ఒప్పుకోలేదని గొంతుకోశాడు