ETV Bharat / crime

PDS Rice Smuggling : కేటుగాళ్ల సరికొత్త పంథా.. మైనర్లతో రేషన్‌ బియ్యం దందా! - తెలంగాణ వార్తలు

PDS Rice Smuggling : పేదప్రజలకు చెందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. పోలీసులు అడపాదడపా తనిఖీలు నిర్వహించి పట్టుకుంటున్నప్పటికీ ఫలితంలేకుండా పోతోంది. పైగా ఈ దందాలో కేటుగాళ్లు రోజుకో పంథాను అనుసరిస్తున్నారు. ఇప్పుడు సరికొత్తగా మైనర్లతో దందా నడుపుతున్నారు.

PDS Rice Smuggling, hyderabad ration rice smuggling
మైనర్లతో రేషన్‌ బియ్యం దందా
author img

By

Published : Jan 12, 2022, 12:12 PM IST

PDS Rice Smuggling : రేషన్‌ బియ్యం దందాలో కేటుగాళ్లు సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మైనర్లతో దందా కొనసాగిస్తున్నారు. మురికివాడల్లో ఉండే బాలురు, చదువు మధ్యలో ఆపేసిన వారి అవసరాలను ఆసరాగా తీసుకుని ఈ దందాలోకి దించుతున్నట్లు సమాచారం. ఎక్కువ మొత్తంలో తరలిస్తుంటే అధికారుల నిఘా ఉంటోందని గ్రహించి మైనర్‌ బాలుర ద్వారా ద్విచక్రవాహనాల్లో కొంత మొత్తంలో తరలిస్తున్నారు. ఇటీవలే.. నంబర్‌ప్లేట్‌లేని ద్విచక్రవాహనంపై 15 ఏళ్ల బాలుడు క్వింటా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా గస్తీలో ఉన్న పోలీసులు శివరాంపల్లి పిల్లర్‌నంబర్‌ 258 వద్ద అతణ్ని నిలువరించారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇంటింటికీ వెళ్లి రేషన్‌ బియ్యం సేకరిస్తున్నట్లు విచారణలో తెలిసింది. కరోనా తర్వాత చాలా మంది రోజువారీ వేతనజీవులకు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. దీంతో చాలా మంది విద్యార్థులు పాఠశాల మానేసి ఇంట్లో పెద్దలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఈ దందాలో పని చేయించుకుంటున్నారు. బియ్యం సేకరించే పనిని వారికి అప్పగించి ద్విచక్ర వాహనాల్లో ఓ చోటికి తీసుకొచ్చి.. అక్కడి నుంచి బాహ్యవలయ రహదారి నుంచి లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రాంతాల్లో ఎక్కువగా...
బాహ్యవలయ రహదారికి సమీపంలో ఉండే ప్రాంతాల్లో ఇలాంటి దందా జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా పాతనగరంలోని చాంద్రాయణగుట్ట, కుమ్మరివాడి, హసన్‌నగర్‌, కేశవగిరిహిల్స్‌, దాస్‌స్కూల్‌బస్తీ, న్యూ ఇంద్రానగర్‌, సులేమాన్‌నగర్‌, దస్తగిర్‌నగర్‌, రాజీవ్‌గాంధీనగర్‌, బండ్లగూడ, ఫలక్‌నుమా, ఫారుక్‌నగర్‌, అంజద్‌దౌలాకాలనీ, హాశామాబాద్‌, నూరీనగర్‌, జహంగీరాబాద్‌, బాలాపూర్‌ రాయల్‌కాలనీ, గాజుమిల్లత్‌ కాలనీ, అల్‌సురూర్‌కాలనీల్లో, హఫీజ్‌బాబానగర్‌, ఎర్రకుంట, షాహిన్‌నగర్‌, ఇస్మాయిల్‌నగర్‌ ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తోంది. ఇక్కడ సేకరించిన బియ్యాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహనాల్లో తరలించి బాహ్యవలయ రహదారిపై ఉన్న లారీల్లోకి ఎక్కించి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

వాహనాలు సీజ్

నవంబర్‌ 25న శివరాంపల్లి వద్ద 25 టన్నుల రేషన్‌ బియ్యాన్ని రాజేంద్రనగర్‌ పోలీసులు సీజ్‌ చేశారు. ఓ లారీతో పాటు రెండు ఆటోలను తనిఖీ చేయగా రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించి ఆ మూడు వాహనాలను సీజ్‌ చేశారు. డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 52 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రాజేంద్రనగర్‌లో పౌరసరఫరాలశాఖ అధికారులు జూన్‌ 25న స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చాంద్రాయణగుట్టలో కిలో రూ.10 చొప్పున తీసుకుని, రూ.15కు కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో వివిధ ఆహార పదార్థాల తయారీలో వీటిని వాడుతుండటంతో వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. నాణ్యత లేని వాటిని దాణా తయారీకి వినియోగిస్తుంటారని సమాచారం. కొంతకాలంగా పెద్దఎత్తున ఈ దందా జరుగుతున్నప్పటికీ అధికారులు నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారే తప్ప ఇందులో ప్రధానపాత్రదారులపై దృష్టిపెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: Panthangi toll plaza traffic : సంక్రాంతి సందడి.. పంతంగి టోల్‌గేట్‌ వద్ద వాహనాల రద్దీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.