అటవీ శాఖ అనుమతులు లేకుండా ఓ వెంచర్ యాజమానులు.. భారీగా చెట్లను నరికేశారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం బొమ్మరాస్పేట్లో జరిగిందీ ఘటన. రంగంలోకి దిగిన అధికారులు.. నిందితులపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశారు.
వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఫైన్.. ఎంత వేయాలో తేల్చే పనిలో ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: విషాదం: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య