లోడు అధికంగా ఉన్న ఓ లారీ... నెమ్మదిగా పక్కకి ఒరుగుతూ... చూస్తుండగానే బోల్తా పడింది. మెదక్ జిల్లా తూప్రాన్ టోల్గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ... అల్లాపూర్ టోల్గేట్ వద్దకు రాగానే పక్కకు ఒరిగింది. గమనించిన డ్రైవర్... లారీని రోడ్డు పక్కన ఆపాడు.
స్థానికుల సహాయంతో సరిచేసేందుకు ప్రయత్నించగా లోడ్ మొత్తం ఒకవైపు కావటం వల్ల ఒక్కసారిగా బోల్తాపడింది. చరవాణుల్లో రికార్డైన ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.