ETV Bharat / crime

రైలు కింద పడి ఆత్మహత్య.. కారణమదే..! - మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్​లోని ఆల్వాల్ రైల్వే స్టేషన్​​ పరిధిలో జరిగింది. సిద్దిపేట జిల్లా తోగుట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్​గా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

one person  suicide on railway track in alwal station  in secunderabad railway police station limits
రైలు కింద పడి ఆత్మహత్య.. కారణమదే..!
author img

By

Published : Mar 16, 2021, 5:09 PM IST

మద్యం మత్తులో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు సిద్దిపేట జిల్లా తోగుట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్​గా పోలీసులు గుర్తించారు. మృతుడు అల్వాల్ ప్రాంతంలో డ్రైవర్​గా విధులు నిర్వహించేవాడని రైల్వే పోలీసులు తెలిపారు.

అయితే లాక్​డౌన్ సమయంలో విద్యాసంస్థలు తెరవకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఈ సమయంలోనే మద్యానికి బానిసైన శ్రీనివాస్ ఇంట్లో వారితో తరచూ గొడవ పడేవారని పోలీసులు తెలిపారు. అల్వాల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: నిజామాబాద్‌లో పసుపు బోర్డు అవసరం లేదు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.