ETV Bharat / crime

live video: తండ్రి నడుపుతున్న కారు కిందపడి ఏడాదిన్నర బాలుడు మృతి - తండ్రి కారు కింద పడి బాలుడు మృతి

హైదరాబాద్​ ఎల్బీనగర్​ మన్సూరాబాద్​లో విషాదం జరిగింది. తండ్రి నడుపుతున్న కారు కింద పడి ఏడాదిన్నర బాలుడు దుర్మరణం చెందాడు (lb nagar car accident). కారు కడిగి లోపల పెడుతుండగా ఘటన జరిగింది.

lb nagar car accident
lb nagar car accident
author img

By

Published : Nov 21, 2021, 10:29 PM IST

Updated : Nov 22, 2021, 2:02 PM IST

తండ్రి నడుపుతున్న కారు కిందపడి ఏడాదిన్నర బాలుడు మృతి

చిన్నపాటి నిర్లక్ష్యం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. చూస్తుండాగానే రక్తం పంచుకున్న బిడ్డ ప్రాణాలు బలిగొంది. ఈ ఘటన హైదరాబాద్​ ఎల్బీనగర్​ ఠాణా పరిధిలో జరిగింది. తండ్రి నడుపుతున్న కారు కిందపడి ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు (lb nagar car accident ). కారును వాష్​ చేసి అపార్ట్​మెంట్​లో పెడుతుండగా.. బాలుడు అకస్మాత్తుగా వచ్చి కారు కిందపడిపోయాడు.

సంగారెడ్డి జహీరాబాద్​కు (zaheerabad) చెందిన లక్ష్మణ్,​ రాణికి అయిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ పాప, ఏడాది వయసున్న బాబు ఉన్నారు. ఉపాధి కోసం ఏడాది క్రితం లక్ష్మణ్​ కుటుంబంతో నగరానికి వలస వచ్చాడు. లక్ష్మణ్​ కారు డ్రైవర్​గా పని చేస్తుండగా.. అతడి భార్య మన్సూరాబాద్​, ఎల్బీనగర్​లోని (boy killed in lb nagar) ఓ అపార్ట్​మెంట్​లో వాచ్​మెన్​గా పనిచేస్తోంది. ఇవాళ ఉదయం లక్ష్మణ్​ కారు కడిగి అపార్ట్​మెంట్​లో పెడుతుండగా.. ఏడాదిన్నర బాలుడు అకస్మాత్తుగా వచ్చి కారు కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని హుటాహుటిన కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Live video: రైలుకు ఎదురుగా నిలబడి వలస కూలీ ఆత్మహత్య

Last Updated : Nov 22, 2021, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.