ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు వద్ద టాటా ఏస్ వ్యాను అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం పట్టణానికి చెందిన పూల వ్యాపారి రామారావు ఆంధ్రప్రదేశ్‌లోని మైలవరం ప్రాంతానికి మల్లెపూల కోసం వ్యాన్‌లో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పల్లిపాడు వద్ద వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొని పక్కనే ఉన్న ఇళ్లలోకి దూసుకెళ్లింది. ఘటనలో రామారావు వ్యానులోనే ఇరుక్కొని మృతి చెందారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 20 నిమిషాల్లో వారు గమ్యం చేరతారనగా.. రామారావు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: రెమ్‌డెసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే ఏడుగురు అరెస్ట్