RTC bus accident in AP: హైదరాబాద్ నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ బస్సు.. ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి వద్ద రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో మెుత్తం 28 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నామ్ రహదారిపై ఆగి ఉన్న లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని పేర్కొన్నారు. మృతుడు కావలికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులను అద్దంకి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. స్వల్పగాయాలైన వారు అద్దంకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: