ETV Bharat / crime

DOG CARRY BORNBABY HEAD: కుక్క నోట్లో నవజాత శిశువు తల.. ఎక్కడంటే? - శిశువు తలను పట్టుకొచ్చిన కుక్క

DOG CARRY BORNBABY HEAD: పాలుగారే పసిపాపలు ఎంతో సుకుమారంగా ఉంటారు. చిన్న గీతపడితేనే గుక్కపట్టి ఏడుస్తారు. అది చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటిది.. కొందరు తల్లిదండ్రులు మాత్రం కర్కషంగా.. అప్పుడే పుట్టిన పసిగుడ్డులను చెత్తకుప్పల్లో.. ముళ్లపొదల్లో వదిలేస్తున్నారు. రక్తపు మరకలు కూడా ఆరని ఆ మాంసపు ముద్దలను.. చీమలు, పక్షులు, కుక్కలకు వదిలేసి.. అమానుషంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ కర్కష తల్లి చేసిన ఘనకార్యానికి.. ఏపాపమెరుగని ఓ నవజాత శిశువు శునకానికి ఆహారంగా మారిపోయింది.

BORNBABY HEAD
నవజాత శిశువు
author img

By

Published : Mar 13, 2022, 5:01 PM IST

Updated : Mar 13, 2022, 7:31 PM IST

DOG CARRY BORNBABY HEAD: బుజ్జి పాదాలు.. చిన్ని చేతులు.. పాలుగారే పసిబుగ్గలు.. లేలేత పెదాలపై విరబూసే బోసి నవ్వులు.. కేరింతలు.. ఇవన్నీ చూస్తూ ఏ తల్లి అయినా మురిసిపోతుంది. ఆ క్షణాల కోసం ప్రతీ అమ్మా ఆరాటపడుతుంది. కానీ.. ఈ తల్లి మాత్రం తన బిడ్డ పట్ల కర్కషంగా వ్యవహరించింది. అమ్మతనాన్ని పక్కనబెట్టి.. పేగుతెంచుకు పుట్టిన శిశువును.. గాలికొదిలేసి పొట్టనబెట్టుకుంది. రక్తపుమరకలు కూడా ఆరని ఆ పసిగుడ్డును కుక్కలకు ఆహారమయ్యేలా చేసింది. ఆ పసిగుడ్డు తలను ఓ వీధి కుక్క నోటకరుచుకుని జనావాసాల్లోకి రావటం వల్ల.. ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే.. ఈ సన్నివేశం హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా గేట్ వద్ద దర్శనమిచ్చింది.

సహార గేట్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో అప్పుడే పుట్టిన ఓ శిశువు తలను ఓ శునకం నోటకరచుకొని వీధుల్లో తిరుగుతోంది. దాన్ని చూసిన స్థానికులు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పక్కనే ఉన్న పాల బూత్ యజమాని కుక్కని తరిమేసి.. వెంటనే వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్​తో తనిఖీలు చేస్తున్నారు. శిశువు తల వీధి శునకం ఎక్కడ నుంచి తెచ్చిందనే విషయంపై సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ శిశువును ఎవరు వదిలేసివెళ్లారు. చనిపోయాక వదిలేసి వెళ్లారా..? లేక.. ప్రాణంతోనే వదిలేసి వెళ్లారా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి.. తాత, తండ్రి, మనుమడు మృతి..

Last Updated : Mar 13, 2022, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.