ETV Bharat / crime

Nirmal Minor Rape Case : బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్టు

sheik Sajid arrest, nirmal rape case
బాలికపై అత్యాచారం ఘటనలో ముగ్గురు అరెస్టు
author img

By

Published : Mar 2, 2022, 2:17 PM IST

Updated : Mar 2, 2022, 5:11 PM IST

14:13 March 02

నిర్మల్‌లో బాలికపై అత్యాచారం ఘటనలో ముగ్గురు అరెస్టు

Nirmal Minor Rape Case : రాష్ట్రంలో సంచలనంగా మారిన నిర్మల్‌లో బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన తెరాస నేత, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ షేక్‌ సాజిద్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సాజిద్‌తో పాటు కారు డ్రైవర్‌ జాఫర్, మధ్యవర్తి అనురాధను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఉపేంద్ రెడ్డి తెలిపారు. నిర్మల్‌ మున్సిపాలిటీ పరిధి విశ్వనాథ్‌పేట్‌ నుంచి గత ఎన్నికల్లో తెరాస తరఫున కౌన్సిలర్‌గా సాజిద్‌ఖాన్‌ ఎన్నికయ్యారు. అనంతరం ఆయనకు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవి దక్కింది.

పథకం ఇలా..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాధ్ పేట్ కాలనీకి చెందిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ సాజిద్ అదే కాలనీలో ఉండే అన్నపూర్ణ అలియాస్ అనురాధతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ మహిళ ఇంట్లో అద్దెకుంటున్న మైనర్ బాలికపై సాజిద్ కన్నేశాడు. అందుకు అనురాధ సహకరిస్తే... ప్లాట్ గిఫ్ట్​గా ఇస్తానని ఆశ చూపాడు. ఫిబ్రవరి 9న నిజామాబాద్​లో ఫంక్షన్ ఉందని... నిజామాబాద్ వెళ్లకుండా సాజిద్ ఖాన్​తో కలిసి వెళ్లారు. అనురాధ సహకారంతో బాలిక తల్లిదండ్రులను నమ్మించి హైదరాబాద్‌ తీసుకువెళ్లిన సాజిద్‌.... ఓ లాడ్జ్‌లో గదిని తీసుకున్నారు.

ఏం జరిగింది?

రెండు రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని డీఎస్పీ తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని వెల్లడించారు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో... ఈ నెల 26న చైల్డ్ లైన్ అధికారులను సంప్రదించి... జరిగిన విషయం చెప్పారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అదే రోజు మున్సిపల్ వైస్ ఛైర్మన్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ విషయం తెలిసి సాజిద్... పరారయ్యాడని పేర్కొన్నారు.

స్పెషల్ టీమ్​లతో గాలింపు

పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి... నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. మహారాష్ట్రలోని అకోలాలో తలదాచుకుని... ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు న్యాయవాదిని సంప్రదించేందుకు మార్చి 2న హైదరాబాద్ బయలుదేరాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిర్మల్ రూరల్ మండలం నీలాయిపేట్ గ్రామ జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు షేక్ సాజిద్​తో పాటు సహకరించిన డ్రైవర్ షేక్ జాఫర్ అలియాస్ వసీం, మధ్యవర్తిగా వ్యవహరించిన అనురాధ అనే మహిళను అరెస్టు చేశారు. వారిని రిమాండ్​కు గురువారం తరలించనున్నట్టు పేర్కొన్నారు.

ఈ కేసులో మధ్యవర్తి అనురాధ, ఆమె తండ్రికి ఓ ఇంటి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సాజిద్​తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఏ సమస్య వచ్చినా ఆమె సాజిద్​ను ఆశ్రయించేది. ఈ క్రమంలో అనురాధ ఇంట్లో ఉండే బాలికపై సాజిద్ కన్ను పడింది. నిజామాబాద్​లో తన చెల్లెలి కూతురి ఫంక్షన్ ఉందని... బాధితురాలిని తీసుకెళ్తానని నమ్మించింది. ఎలాగూ స్కూల్ లేదని బాలిక తల్లిదండ్రులు పంపించారు. అక్కడ వారు ఆర్టీసీ బస్సు ఎక్కారు. నిజామాబాద్ నుంచి సాజిద్ కారులో హైదరాబాద్​కు వచ్చారు. మధ్యలో ఐస్ క్రీమ్ ఇప్పించారు. అక్కడి నుంచి ఓ లాడ్జికి తీసుకెళ్లి రూములు బుక్ చేశారు. అర్ధరాత్రి వేళ సాజిద్... బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా బాధితురాలిపై రెండు రోజుల పాటు రేప్ చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే... చంపేస్తాడని అనురాధ బెదిరించింది.

-ఉపేందర్‌రెడ్డి, నిర్మల్‌ డీఎస్పీ

రౌడీ షీట్ ఓపెన్

షేక్ సాజిద్​పై గతంలోనూ 3 కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. పదవిని అడ్డం పెట్టుకొని అత్యాచారానికి ఒడిగట్టిన సాజిద్​పై కిడ్నాప్, పోక్సో చట్టం, రౌడీ షీట్ కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాస్, వెంకటేష్, రూరల్, సారంగాపూర్, నర్సాపూర్ (జి) ఎస్సైలు వినయ్, కృష్ణాసాగర్, పాకాల గీత పాల్గొన్నారు.

ఇదీ చదంవడి: కాల్పుల ఘటనలో వీడని చిక్కుముడి.. వివాదాస్పద భూముల సెటిల్‌మెంట్‌లో శ్రీనివాస్‌రెడ్డి పాత్ర?

Last Updated : Mar 2, 2022, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.