ETV Bharat / crime

NIA RAIDS: రాష్ట్రంలో ఎన్‌ఐఏ సోదాలు... పేలుడు పదార్థాలు స్వాధీనం - ఎన్​ఐఏ సోదాలు

nia searches
పేలుడు పదార్థాల కేసులో సోదాలు
author img

By

Published : Jul 19, 2021, 9:52 PM IST

Updated : Jul 19, 2021, 10:39 PM IST

21:47 July 19

పేలుడు పదార్థాల కేసులో సోదాలు

రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ఎన్​ఐఏ సోదాలు (NIA Raids)  నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసు (Case of Explosive)లో తనిఖీలు నిర్వహించినట్లు ఎన్​ఐఏ (NIA) వెల్లడించింది. మహబూబ్​నగర్​, వరగంల్​, జనగామ, భద్రాద్రి, మేడ్చల్​ జిల్లాల్లో సోదాలు నిర్వహించారు.

మహబూబ్​నగర్​ జిల్లాలోని ముత్తు నాగరాజు, వి. సతీశ్​ ఇళ్లలో సోదాలు చేశారు.  మేడ్చల్​లోని కొమ్మరాజు కనకయ్య ఇంట్లో... భద్రాద్రి జిల్లాలోని గుంజి విక్రమ్, త్రినాథరావు ఇళ్లల్లో... జనగామలో సూరసారయ్య, వరంగల్‌లో వేలుపు స్వామి ఇళ్లలో తనిఖీలు చేశారు. 

ఈ దాడుల్లో 400 ఎలక్ట్రిక్​ డిటోనేటర్లు (Electric Detonators), 500 నాన్​ ఎలక్ట్రిక్​ డిటోనేటర్ల (Non-Electric detonators)తో పాటు 400 జిలెటిన్​ స్టిక్స్ (Gelatin sticks), 549 మీటర్ల ఫ్యూజ్​ వైర్లు (Fuse wires) స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీ, గ్రనేడ్​ లాంఛర్ల తయారీకి అవసరమైన సామాగ్రి గుర్తించామని... పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్​ఐఏ పేర్కొంది. ఈ పేలుడు పదార్థాలను మావోయిస్టు నేత హిడ్మా (Maoist Leader Hidma )కు ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నామని ఎన్​ఐఏ వెల్లడించింది. 

ఇదీ చూడండి: Darbhanga blast: కాసేపట్లో ఎన్​ఐఏ కోర్టుకు దర్భంగా పేలుడు కేసు నిందితులు

Last Updated : Jul 19, 2021, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.