ETV Bharat / crime

పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లోని పౌరహక్కుల సంఘం, విరసం నాయకుల ఇళ్లలో బుధవారం ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ అరెస్టయ్యారు. బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్​లో పీఎన్టీ కాలనీలోని ఆయన ఇంట్లో సోదాలు చేసిన జాతీయ దర్యాప్తు సంస్ధ రఘునాథ్​ను అరెస్ట్​ చేసింది.

author img

By

Published : Apr 1, 2021, 12:51 AM IST

Updated : Apr 1, 2021, 6:06 AM IST

nia
పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు
పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లోని పౌరహక్కుల సంఘం, విరసం నాయకుల ఇళ్లలో బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహించారు. పలుప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల సమయంలో మొదలైన సోదాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి.

మావోయిస్టులకు సమాచారం చేరవేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారని గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం గ్రామీణ జిల్లా ముంచంగిపుట్టు పోలీస్‌స్టేషన్‌లో ఒక వార్తా ఛానల్‌ విలేకరి పొంగి నాగన్నపై కేసు నమోదయింది. తర్వాత ఈ కేసు ఎన్‌.ఐ.ఎ.కు బదిలీ అయింది. దీనికి సంబంధించి మార్చి 7న హైదరాబాద్‌ ఎన్‌ఐఏ అధికారులు కొత్తగా మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్‌ఛార్జి అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే, కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ గణేష్‌తోపాటు వివిధ ప్రజాసంఘాలకు చెందిన మొత్తం 64 మందిపై భారత శిక్షా స్మృతి (ఐపీసీ), చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ పీ అండ్‌ టీ కాలనీలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, న్యాయవాది వి.రఘునాథ్‌, మెహిదీపట్నంలోని ప్రజానాట్య మండలి మాజీ కళాకారుడు డప్పు రమేష్‌, జవహర్‌నగర్‌లోని ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షులు జాన్‌, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌, కడప జిల్లా ప్రొద్దుటూరులోని విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మి, కర్నూలు జిల్లాలోని విరసం నాయకులు పినాకపాణి, అరుణ్‌ (సోమశేఖర శర్మ)ల ఇళ్లలో సోదాలు జరిపారు. విశాఖపట్నం పిఠాపురంకాలనీ లోని న్యాయవాది కె.పద్మ, చినవాల్తేరులోని న్యాయవాది కె.ఎస్‌.చలం, రాజమండ్రిలో ఏపీసీఎల్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

రఘునాథ్ అరెస్ట్​..

సోదాల అనంతరం పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ అరెస్టయ్యారు. హైదరాబాద్​లో పీఎన్టీ కాలనీలోని ఆయన ఇంట్లో ఎన్​ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రఘునాథ్‌ ఇంట్లో పలు పత్రాలు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

నోరు నొక్కేందుకే..

అసమానతలపై ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాల నోరు నోక్కేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని పౌరహక్కుల సంఘం నాయకులు విమర్శించారు. ఈ మేరకు సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.నారాయణరావులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అక్రమ సోదాలను ఖండిస్తున్నామని, కేసులు పెట్టి హక్కులు హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అందరూ ఖండించాలన్నారు. ఈ సోదాలను విరసం సభ్యుడు మంచాల అచ్యుత సత్యనారాయణరావు ఖండించారు. భావప్రకటన స్వేచ్ఛను, మానవ హక్కులను అణచివేస్తూ సమాజంలో భయానక వాతావరణం సృష్టించడం అప్రజాస్వామికమన్నారు.

ఇవీచూడండి: పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి ఇంట్లో ఎన్​ఐఏ సోదాలు

Last Updated : Apr 1, 2021, 6:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.