ETV Bharat / sports

టన్నుల కొద్దీ పరుగులు - కానీ కెరీర్​లో ఒక్క సెంచరీ కూడా లేదు! - Most Runs Without Century

Cricketers Most Runs Without Century : అంతర్జాతీయ క్రికెట్​లో ఒక్క సెంచరీ లేకుండా అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ప్లేయర్లెవరో మీకు తెలుసా?

Most Runs Without Century
Most Runs Without Century (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 4, 2024, 2:49 PM IST

Most Runs Without Century : ఒకప్పుడు క్రికెట్‌లో బ్యాటర్లపై ఎక్కువ పరుగులు చేయాలని, బౌలర్లు కీలక వికెట్లు తీయాలనే అంచనాలు ఉండేవి. రెండూ చేయగల ఆల్‌రౌండర్‌లపై ఒత్తిడి ఉండేది కాదు. ఇప్పుడు క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. టెయిలెండర్ల నుంచి కూడా పరుగులు ఆశిస్తున్నారు. అయితే సాధారణంగా 10, 11వ స్థానంలో బౌలర్లు బ్యాటింగ్‌కి వస్తుంటారు. కొందరు బౌలర్లు కూడా అవకాశం వచ్చినప్పుడు బౌండరీలు బాదుతుంటారు. ఇలా కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు ఎవరో తెలుసా?

  1. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) : అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కసారి కూడా 100 పరుగుల మార్క్ చేరుకోకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ రికార్డు సృష్టించాడు. 339 మ్యాచ్​ల్లో (306 ఇన్నింగ్స్‌లు) 4172 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. వార్న్ 145 టెస్టుల్లో 3154 పరుగులు చేశాడు. 2001లో న్యూజిలాండ్‌పై అత్యధికంగా 99 పరుగులు చేశాడు. 194 వన్డేల్లో 1018 పరుగులు సాధించాడు.
  2. కాలిన్స్ ఒబుయా (కెన్యా) : కెన్యా మాజీ ఆల్ రౌండర్ కాలిన్స్ ఒబుయా 179 అంతర్జాతీయ మ్యాచ్​ల్లో (159 ఇన్నింగ్స్‌లు) 3786 పరుగులు చేశాడు. రెండు దశాబ్దాలకు పైగా ఆడినప్పటికీ, అతను ఎప్పుడూ సెంచరీ మార్క్ అందుకోలేదు. కానీ, అతడి పేరు మీద 20 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 104 వన్డేల్లో 2044 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 98*. 75 టీ20Iల్లో 1742 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 96*.
  3. చము చిభాభా (జింబాబ్వే) : జింబాబ్వే ఆటగాడు చాము చిభాభా 150 అంతర్జాతీయ మ్యాచ్​ల్లో (154 ఇన్నింగ్స్‌లు) 3316 పరుగులు చేశాడు. 2015లో పాకిస్థాన్‌పై అత్యధికంగా 99 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో 22 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఐదు టెస్టు మ్యాచ్​ల్లో 175 పరుగులు, 109 వన్డేల్లో 2474 పరుగులు, టీ20ల్లో 667 పరుగులు చేశాడు.
  4. టిమ్ సౌథీ (న్యూజిలాండ్) : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ 387 అంతర్జాతీయ మ్యాచ్‌లలో (289 ఇన్నింగ్స్‌లు) 3141 పరుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 100 టెస్టు మ్యాచుల్లో ఆరు హాఫ్‌ సెంచరీలతో 2098 పరుగులు చేశాడు. వన్డేల్లో 161 మ్యాచుల్లో 740 పరుగులు చేశాడు. టీ20ల్లో 303 పరుగులు చేశాడు.
  5. మష్రఫే మోర్తజా (బంగ్లాదేశ్) : బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజా 310 అంతర్జాతీయ మ్యాచ్‌లు (264 ఇన్నింగ్స్‌లు) ఆడి 13.45 యావరేజ్‌తో 2961 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 36 మ్యాచ్‌ల్లో 797 పరుగులు చేశాడు. వన్డేల్లో 220 మ్యాచ్‌లలో 13.74 యావరేజ్‌తో 1787 పరుగులు చేశాడు. టీ20ల్లో 54 మ్యాచ్‌లలో 377 పరుగులు చేశాడు.

'ఆ ముగ్గురు' టీమ్​ఇండియా బ్యాటర్లు- వన్డే ఫార్మాట్​లో ఒక్కసారి కూడా ఔట్​ కాలేదట! - Cricketers Who Never Got Out in ODI

17 ఏళ్లలో 600 శాతం పెరిగిన ఐపీఎల్ ఫ్రాంచైజీల లిమిట్- తొలి సీజన్​లో ఎంతంటే? - IPL 2025 Purse Value

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.