ETV Bharat / business

బెజోస్‌ను దాటేసిన మార్క్‌ జుకర్‌బర్గ్‌ - ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానం - Bloomberg Billionaires Index - BLOOMBERG BILLIONAIRES INDEX

World's Richest People : బ్లూమ్‌బెర్గ్‌ బిలయనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్‌ బెజోస్‌ను దాటి తొలిసారిగా మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్ రెండో స్థానానికి చేరుకున్నారు.

Mark Zuckerberg and Jeff Bezos
Mark Zuckerberg and Jeff Bezos (ANI and AP)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 2:49 PM IST

World's Richest People : మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన రెండో స్థానానికి చేరుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్‌ బెజోస్‌ను దాటి తొలిసారిగా ఈ స్థానానికి చేరుకున్నారు మార్క్ జుకర్‌బర్గ్‌. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్ వెల్లడించింది.

నంబర్‌-1 ఎవరు?
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఫేస్‌బుక్ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద ప్రస్తుతం 206 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపద 205 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ 256 బిలియన్‌ డాలర్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.

భారతీయ కుబేరుల సంగతేంటి?
ఇండియన్‌ బిలియనీర్లలో ముకేశ్‌ అంబానీ 107 బిలియన్‌ డాలర్ల సంపదతో 14వ స్థానంలో ఉన్నారు. భారతదేశంలో ఆయనే అగ్రస్థానంలో ఉన్నారు. 100 బిలియన్‌ డాలర్లతో గౌతమ్‌ అదానీ 17వ స్థానంలో కొనసాగుతున్నారు.

కారణమిదే!
ఇటీవల మెటా షేర్లు అంచనాలకు మించి రాణించాయి. రెండో త్రైమాసికంలో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదవ్వడం, ఏఐ చాట్‌బాట్‌లను మరింత శక్తివంతంగా మార్చేందుకు లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్లను పెంచడం వల్లనే మెటా షేర్లు 23 శాతం వరకు పెరిగాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో మెటా సంస్థ షేరు విలువ ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకి 582.77 డాలర్ల వద్ద ముగిసింది. ఏఐ రేసులో ముందంజలో నిలిచేందుకు గాను డేటా సెంటర్‌లను, కంప్యూటింగ్‌ పవర్‌ను పెంచేందుకు మెటా పెద్ద ఎత్తున డబ్బుల్ని వెచ్చిస్తోంది. తాజాగా ఓరియన్‌ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్‌ను కూడా పరిచయం చేసింది. ఇవన్నీ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద భారీగా పెరగడానికి కారణమయ్యాయి.

బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్‌

ర్యాంక్‌పేరుసంపద (డాలర్లలో) ఇండస్ట్రీ
1ఎలాన్​ మస్క్256 బిలియన్​టెక్నాలజీ
2 మార్క్‌ జుకర్‌బెర్గ్‌206 బిలియన్‌టెక్నాలజీ
3జెఫ్ బెజోస్​205 బిలియన్​టెక్నాలజీ
4బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌193 బిలియన్​కన్సూమర్​
5లారీ ఎలిసన్‌179 బిలియన్​టెక్నాలజీ
6బిల్​ గేట్స్​161 బిలియన్​టెక్నాలజీ
7లారీ పేజ్​156 బిలియన్​టెక్నాలజీ
8స్టీవ్ బల్మెర్​145 బిలియన్​టెక్నాలజీ
9వారెన్ బఫెట్‌143 బిలియన్​డైవర్సిఫైడ్​
10సెర్గీ బ్రిన్​141 బిలియన్​టెక్నాలజీ
11అమాన్సియో ఒర్టెగా114 బిలియన్‌రిటైల్​
12మైఖేల్ డెల్​110 బిలియన్​టెక్నాలజీ
13జెన్సన్ హువాంగ్107 బిలియన్​టెక్నాలజీ
14ముకేశ్ అంబానీ107 బిలియన్​ఎనర్జీ
17గౌతమ్ అదానీ100 బిలియన్​ఇండస్ట్రియల్​
49సావిత్రి జిందాల్‌35.8 బిలియన్‌​కమోడిటీస్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.