ETV Bharat / crime

newly married women suicide: వరకట్న వేధింపులకు మరో నవవధువు బలి.. పెళ్లైన ఐదు నెలలకే..

newly married women suicide: వరకట్న వేధింపులకు మరో నవవధువు బలైపోయింది. వివాహం చేసుకుని ఐదు నెలలు నిండిన ఆ వధువు.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లోని చందానగర్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది.

newly married women suicide for dowry harassment in Chandanagar

author img

By

Published : Dec 17, 2021, 4:21 PM IST

newly married women suicide: పెళ్లైన ఐదు మాసాలకే ఓ నవవధువు తనువు చాలించింది. అదనపు కట్నం కోసం అత్తమామలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్​లోని చందానగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్​లోని డొయెన్స్​ కాలనీకి చెందిన సయ్యద్​ హమీద్​​.. పాతబస్తీకి చెందిన ఫాతిమాను ఐదు నెలల క్రితం నిఖా చేసుకున్నాడు. మూడు నెలల తర్వాత హమీద్​ దుబాయ్​కి వెళ్లిపోయాడు. ఫాతిమా.. అత్తమామలతోనే ఉంటుంది.

భర్త దుబాయ్​కు వెళ్లినప్పటి నుంచి ఫాతిమాను అత్తమామ వేధించటం ప్రారంభించారు. అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురిచేయగా.. తీవ్ర మనస్తాపానికి గురైన ఫాతిమా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణం చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫాతిమా మరణ వార్త విని ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అత్తమామల వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫాతిమా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కూతురి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.