ETV Bharat / crime

ప్రేమ వివాహం.. మూడు రోజులకే వరుడు దుర్మరణం

ప్రేమించిన వాడితో సంతోషంగా ఉంటానని అనుకుంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. పెళ్లైన మూడు రోజులకే నవ వరుడు మృతి చెందాడు. కలకాలం తోడుంటాడనుకున్న భర్త.. కాళ్ల పారాణి ఆరక ముందే మరణించడాన్ని తలచుకొంటూ నూతన వధువు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

bride died at anantapur
పెళ్లైన మూడు రోజులకే నవ వరుడు దుర్మరణం..
author img

By

Published : Mar 28, 2021, 7:25 PM IST

ప్రేమ వివాహం చేసుకున్న మూడు రోజులకే ప్రమాదానికి గురై నవవరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఏపీ అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరులో జరిగింది.

ఏం జరిగింది..

నగరూరు గ్రామానికి చెందిన పవన్ కల్యాణ్(22) ఓ రాజకీయ నేత వద్ద జీపు డ్రైవర్​గా పనిచేసేవాడు. హైదరాబాద్​కు తరచుగా వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్​నగర్​కు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అమ్మాయి తరఫున పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడం వల్ల.. ప్రేమికులిద్దరూ ఈ నెల 24న యాడికి పోలీసులను ఆశ్రయించారు. వారిద్దరూ మేజర్లు కావడం వల్ల.. అబ్బాయి కుటుంబ సభ్యులు ఈనెల 25వ తేదీన వివాహం జరిపించారు.

పవన్ కల్యాణ్.. తన జేసీబీని జొన్నగిరి మండలం బొమ్మనపల్లి గ్రామానికి పంపించాడు. అనంతరం తానూ అక్కడికి వెళ్లి పనులను పరిశీలిస్తుండగా.. ట్రాక్టర్ ట్రాలీ లిఫ్ట్ కిందకు దిగకపోవటంతో మరమ్మతు చేసేందుకు వాహనం కిందకు వెళ్లాడు. ఉన్నట్టుండి.. ట్రాలీ మీద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివాహం జరిగిన మూడు రోజులకే వరుడు దుర్మరణం చెందడం వల్ల బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవీచూడండి: హత్య చేశాడు.. కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.. చివరికి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.