ETV Bharat / crime

లారీ, కారు ఢీ... నవ దంపతులు మృతి

author img

By

Published : Jul 7, 2021, 10:38 PM IST

పెళ్లై పది రోజులు కాకముందే నవదంపతుల్ని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. కోటి ఆశలతో ఒక్కటైన ఆ జంటను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో నవ దంపతులు తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన ఏపీ అనంతపురం జిల్లాలో జరిగింది.

Accident: లారీ, కారు ఢీ... నవ దంపతులు మృతి

ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నవదంపతులు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. అనంతపురం ఆర్​కే నగర్​కు చెందిన దంపతులు సుధాకర్ నాయుడు, కీర్తికి పది రోజుల క్రితం వివాహమైంది. సుధాకర్ నాయుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడగా..పెళ్లి కోసం అనంతపురానికి వచ్చాడు.

దంపతులు తమ వ్యక్తిగత పనుల నిమిత్తం బెంగళూరుకు వెళ్లి కారులో తిరుగు పయనమయ్యారు. బొమ్మపర్తి గ్రామ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్​ను ఢీకొట్టారు. వాహనాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో కీర్తి అక్కడికక్కడే మృతి చెందగా... సుధాకర్ నాయుడు తీవ్రగాయాలతో అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పెళ్లైన పదిరోజులకే నవదంపతులు మృతి చెందటంతో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: కూతురును రోకలి బండతో కొట్టి చంపిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.