ETV Bharat / crime

Cyber Crime: వ్యాపారి వ్యాలెట్ల హ్యాకింగ్.. సందేశం రాకుండా రూ.2.2 కోట్లు స్వాహా - క్రిప్టో వ్యాలెట్స్ హ్యాక్

Crypto Wallets Hacked: కొత్త తరహాలో సైబర్‌ నేరస్థులు నిధులు కొల్లగొడుతున్నారు. క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లలో డిజిటల్‌ కరెన్సీని గుట్టుగా బదిలీ చేసుకుని.. బదిలీ అయిన కరెన్సీకి సంబంధించి చరవాణిలో సందేశం కూడా రాకుండా తమ పని పూర్తి చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యాపారి వ్యాలెట్‌ నుంచి రూ.2.20 కోట్లు డిజిటెల్‌ కరెన్సీని బదిలీ చేసుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయగా… వ్యాలెట్‌ హ్యాకింగ్ తమ దృష్టికి తొలిసారి వచ్చిందని పోలీసులు తెలిపారు.

Cyber Crime, Crypto Wallets Hacked
వ్యాలెట్ల హ్యాకింగ్
author img

By

Published : Dec 18, 2021, 9:51 AM IST

Crypto Wallets Hacked: వ్యక్తిగత, సంస్థల ఈ మెయిల్స్‌ హ్యాక్‌ చేసి కోట్లు దండుకుంటున్న సైబర్‌ నేరస్థులు ఏకంగా ఈ వ్యాలెట్లలోని డిజిటెల్‌ కరెన్సీని బదిలీ చేసుకుంటున్నారు. చరవాణులు, ల్యాప్​టాప్​లను హ్యాకింగ్ చేస్తున్నారు. చరవాణులు, ల్యాప్‌టాప్‌లలోని వాట్సాప్‌, యాప్స్, మెయిల్స్‌, ఫేస్‌బుక్‌లు వినియోగిస్తున్న వారికి గుర్తు తెలియని మాధ్యమాల ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. బాధితులు వాటిని చూసిన వెంటనే వారి చేతుల్లోకి అన్ని వివరాలు వెళ్లిపోతున్నాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… వారు ఆశ్చర్యపోయారు. ఈ తరహా సైబర్‌ నేరం మొదటిసారి బయటపడిందన్నారు.

చరవాణులు, ల్యాప్‌టాప్‌ డెస్క్‌టాప్‌లను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరస్థులు సికింద్రాబాద్‌లోని ఓ వ్యాపారి వ్యాలెట్ల నుంచి రూ.2.20 కోట్ల డిజిటల్‌ కరెన్సీని బదిలీ చేసుకున్నారు. బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్​కు చెందిన లోక్‌జిత్‌ సాయినాథ్‌ ఆరేడేళ్ల నుంచి క్రిప్టోకరెన్సీ కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తున్నాడు. వాటికి సంబంధించిన యాప్‌లను కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌పై ఉంచాడు. నిత్యం లావాదేవీలు నిర్వహిస్తుండగా.. ఈ నెల 3న అతని వ్యాలెట్లలోని రూ.2.20 కోట్ల డిజిటల్‌ కరెన్సీని మార్చుకునేందుకు యత్నించగా వీలు కాలేదు. లావాదేవీలు నిర్వహించేందుకు వీల్లేకపోయినా... తన వ్యాలెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహిస్తున్నారని గుర్తించాడు. రెండు రోజుల్లోనే రూ.2.20 కోట్ల డిజిటల్‌ కరెన్సీని 3.5 లక్షల అమెరికన్‌ డాలర్లుగా మార్చి బదిలీ చేసుకున్నట్లు తెలుసుకున్నాడు. వ్యాలెట్లను రూపకల్పన చేసిన కంపెనీల సహాయ కేంద్రాలను సంప్రదించినా ఉపయోగం లేకపోవడంతో చివరకు ఫిర్యాదు చేశాడు.

సందేశాలా.. యాప్‌లా..?

డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరస్థులను వాటిని హ్యాకింగ్‌ చేసేందుకు సందేశాలు పంపించారా?.. యాప్‌ల ద్వారా వాటిని అధీనంలోకి తీసుకున్నారా? అన్న అంశాలను పరిశీలిస్తున్నామని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. లోక్‌జిత్‌ సాయినాథ్‌ ల్యాప్‌టాప్‌ను పరిశీలిస్తే రిమోట్‌ కంట్రోల్‌ వంటి సాంకేతికతతో డిజిటల్‌ కరెన్సీని బదిలీ చేసుకున్నారా?.. ఐపీ చిరునామాలను డూప్లికేట్‌ చేశారా?.. అన్న అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. రెండు నెలల క్రితం ఓ వ్యక్తి చరవాణిని హ్యాక్‌ చేసి అతని వ్యాలెట్‌లోని రూ.25 లక్షల విలువైన బిట్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీని బదిలీ చేసుకున్నారని చెప్పారు. డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌, చరవాణి హ్యాకింగ్‌ చేయడం కొత్త తరహా మోసమని వివరించారు.

ఇదీ చూడండి: 'ప్రకటనలు వేసి సినిమాను ఆలస్యంగా ప్రారంభించినందుకు రూ.లక్ష జరిమానా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.