ETV Bharat / crime

బ్లాక్​ ఫంగస్​తో నూతన వరుడు మృతి

మూడు నెలల క్రితమే పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. నెల రోజులకే కరోనా బారిన పడి చికిత్స పొంది వైరస్​ను జయించాడు. అంతా బాగుందనుకునేలోపే బ్లాక్​ ఫంగస్​ రూపంలో మరో వైరస్​ అతడిపై దాడి చేసింది. అప్పటికే అలసిపోయిన ఆ నూతన వరుడు.. పోరాడలేక ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పీఎస్ పరిధిలో ఇది జరిగింది.

died with black fungus
died with black fungus
author img

By

Published : Jun 8, 2021, 9:53 PM IST

కరోనా రెండో దశ ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగుల్చుతోంది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం యానంపేటకు చెందిన రాజేశ్‌(29) వివాహమైన మూడు నెలలకే బ్లాక్​ ఫంగస్​తో మృతి చెందాడు. పెళ్లయిన నెల రోజులకే కొవిడ్ మహమ్మారి బారిన పడి క్షేమంగా బయటపడ్డ రాజేశ్​ను.. ఫంగస్ రూపంలో మృత్యువు కబళించింది.

మూడు నెలల క్రితమే పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న రాజేశ్​కు ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. వైద్య చికిత్సల కోసం రూ. 27 లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణం దక్కలేదంటూ ఆ ఇరు కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులను కన్నీళ్లు పెట్టించింది.

ఇదీ చదవండి: కన్నతల్లి కర్కషత్వం.. కుమారున్ని కొట్టి చంపిన వైనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.